Mohan Babu: ఇక‌నైనా ఆ ప‌నులు మానుకోండి.. నేనెవరికీ భయపడనంటున్న మోహ‌న్ బాబు

-

Mohan Babu: ర‌స‌వ‌త్త‌రంగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా) ఎన్నిక స‌మ‌రంలో మంచు విష్ణు అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా నేడు ‘మా’ నూత‌న‌ అధ్యక్షుడిగా నటుడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం చేశాడు. ఆయ‌న తో పాటు గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో మా న‌వ కార్య‌వ‌ర్గం కొలువుదీరిన‌ట్టు అయ్యింది.
ప్రమాణ స్వీకారోత్సవానికి ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్ వేదికైంది.

ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీనియ‌ర్ నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. త‌న‌దైన శైలితో ప్రత్యర్ధి వర్గానికి చురకలు అంటించారు.

ఇప్ప‌టి నుంచైనా.. టీవీలకు ఎక్కడం, రెచ్చ‌గొట్ట‌డం మానుకోండ‌నీ అని హెచ్చ‌రించారు. అందరం కలిసి పనిచేద్దామ‌ని, పదే పదే రెచ్చగొడితే గుడిసెలో ఉన్నవాడైనా రెచ్చిపోతాడనీ, ఇది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక హిత‌వు ప‌లికాడు. రాజకీయాల కంటే టాలీవుడ్ లోనే పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మనమంతా ఒకే తల్లిబిడ్డలం.. మొదటి నుంచి మా నినాదమిదేన‌ని మోహన్ బాబు అన్నారు.

ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలను గౌరవించుకునే సంస్కారం పోయిందని, క‌ళాకారులు బెదిరింపులకు భయపడరని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌నని చాలా మంది అంటూ బెదిరించారనీ.. అయినా ఆ బెదిరింపులకు భయపడలేదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news