ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటుకు లక్ష అడగండి : ఈటల

ఎంత ఇచ్చినా తీసుకోండి.. ఓటుకు లక్ష అడగండి అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కమలా పూర్ మండలంలోని కొత్తపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈటల రాజేందర్, హాజరైన కూన శ్రీశైలంగౌడ్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పచ్చటి సంసారంలో చిచ్చు కెసిఆర్ పెడతారని… దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్దతుల్లో ఇక్కడ పుడితే తెరాసా లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ఉద్యోగాలు పీకేస్తం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని.. వీటికి ఇచ్చే డబ్బులు అన్నీ ప్రజలు కట్టే పన్నులేనని చెప్పారు. సీసాల మీద సంవత్సరానికి 30 వేల కోట్లు, రోజుకు 90 కోట్లు కడుతున్నామని… మనకు ఇచ్చేది పెన్షన్లకు 9 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మి కి1500 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొన్నారు.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కాలం లోనే పెన్షలు ఉన్నాయని… డబ్బులు అందరికీ వచ్చాయని గుర్తు చేశారు. తాను ఉన్నంత వరకు పెన్షన్, రేషన్ కార్డ్, కళ్యాణ లక్ష్మి, దళిత బందు, రైతు బందు ఆగదని…చెప్పారు. దసరాకు మందు, మాంసం ఇచ్చారని. ఓటుకు లక్ష ఇవ్వమని అడగాలని పేర్కొన్నారు. ఎంత ఇచ్చినా తీసుకోండి.. దళిత బంధు, పావలా వడ్డీ చెక్కులు, రోడ్డు, ఓటుకు డబ్బులు  తన వల్ల వస్తున్నాయి.. దీనిని మర్చిపోకండి అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.