స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి సరికొత్త ఫీచర్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తుంది. తాజాగా కొత్త ఫీచర్ ని స్టేట్ బ్యాంక్ తీసుకు రావడం జరిగింది. అయితే దీని వలన సైబర్ నేరాలు, బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవాలనే స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. యోనో లైట్ యాప్‌ లో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ ని సేఫ్ గా ఉంచాలని ఎస్బీఐ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను తీసుకు రావడం జరిగింది.

 

SBI
SBI

ఈ మధ్య కాలం లో ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ ఎక్కువ అవ్వడం.. మోసాలు కూడా ఎక్కువవ్వడం మనం చూస్తున్నాం. వీటిని ఆపాలని బ్యాంకులు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు అయితే ఎస్‌బీఐ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యోనో లైట్ యాప్‌లో ఈ ఫీచర్ వాడచ్చు. ముందు యాప్ ని మాత్రం అప్డేట్ చేసుకోండి.

యోనో లైట్ యాప్ 5.3.48 వర్షన్‌లో సిమ్ బైండింగ్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ వలన ఒక యూజర్ ఒక డివైజ్‌లోనే తమ అకౌంట్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న దానిలోనే. ఆ మొబైల్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ ఉండాలి.

ఈ ఫీచర్ ని వాడాలంటే ముందు ఎస్‌బీఐ యోనో లైట్ యాప్ అప్‌డేట్ చేసి యోనో లైట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత SIM 1 లేదా SIM 2 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏ స్లాట్‌ లో ఉంటే ఆ స్లాట్ సెలెక్ట్ చేయండి. ఒకటే సిమ్ కార్డ్ కనుక మీ ఫోన్ లో ఉంటే సిమ్ సెలెక్షన్ అవసరం లేదు. మీ మొబైల్ నెంబర్ వేలిడేషన్ కోసం మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఓ ఎస్ఎంఎస్ పంపాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news