బోసిడికే అంటే దాని అర్థం ల**కొడుకు అని సీఎం జగన్ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని… ఆయన తల్లిని కూడా ఇలాంటి దారుణమైన బూతులు తిడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తిట్టినందుకు సీఎంను అభిమానించేవారు తిరగ బడాలని…రెచ్చిపోవాలని దాని వల్ల గొడవలు సృష్టించాలని ఆరాటపడుతున్నారని తెలిపారు. అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి విమర్శించారు.
కొన్ని న్యూస్ పేపర్ లు మీడియా ఛానల్స్ తన వాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గిట్టని మనిషి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఏదో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఏపీ అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీ పడవద్దని సీఎం అన్నారు. తప్పు చేసిన వారిని వదల వద్దని…చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.