Rowdy Boys: “రౌడీ బాయ్స్‌” సాంగ్ రిలీజ్ చేసిన రౌడీ..

-

Rowdy Boys: ఏ రంగంలోనైనా.. త‌మ వార‌సులను తీసుక‌రావ‌డం సాధార‌ణ‌మే.. ఇక మ‌న సినీ ఇండస్ట్రీలోకి మ‌రి ఎక్కువ చూస్తూ ఉంటాం.. ఇప్పటికే చాలా మంది ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టారు. ఈక్రమంలోనే ఇప్పుడు మరో స్టార్ ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి ఓ హీరో రాబోతున్నాడు. దిల్‌ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆయ‌న హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’.

ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ‘రౌడీ బాయ్స్‌’ అక్టోబరులో విడుదల కానుంది. దీంతో సినీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా.. టీజర్ , పోస్టర్స్ ప్రేక్షకులను
విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను రౌడీ హీరో విజ‌య దేవ‌ర కొండ చేతుల మీదుగా లాంచ్ చేయించారు.

ప్రేమే ఆకాశ‌మైతే ఓ మై జాను… అంటూ సాగే పాట‌ను జాస్ప్రిత్ జాజ్ పాడాడు. శ్రీమ‌ణి సాహిత్యం అందించగా.. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం స‌మ‌కూర్చారు. ఈ చిత్రానికి ఈ పాట స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలువ‌నున్న‌ది. ఓ అమ్మాయి కోసం రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ అనే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news