BREAKING : ప‌ట్టాభికి 14 రోజుల పాటు రిమాండ్

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి పట్టాభి కి రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఏకంగా 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. తాజాగా విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం… నవంబర్ 2వ తేదీ వరకు పట్టాభి రిమాండ్ కొనసాగనుంది. ఇక ఈ కస్టడీ నేపథ్యంలో… బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు పట్టాభిరాం. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది విజయవాడ కోర్టు.

ఇక నిన్న అరెస్టు చేసిన పట్టాభిరామ్ ను… ఇవాళ మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. ఇప్పటికే నా ఇంటి పై పలుమార్లు దాడిచేశారని.. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఈ సందర్భంగా కోర్ట్ కు విన్నవించారు..

తాను విద్వేషాలు రెచ్చ గొట్టేలా మాట్లాడలేదని.. తన ప్రెస్ మీట్ వీడియో క్లిపింగ్ పరిశీలించాలి అంటూ న్యాయ మూర్తినీ వేడుకున్నారు పట్టాభి. తనకు 41 నోటీస్ ఇవ్వకుండా నే రాత్రి 9.30 గంటల సమయం లో అరెస్ట్ చేసారని.. కాన్ఫెషన్ స్టేట్మెంట్ లో మధ్యవర్తులు లేకుండా నే నాతో పోలీసులు బలవంతం గా సంతకం చేయించారు అంటూ న్యాయమూర్తి కి వివరించారు పట్టాభి. ఇక ఈ వాదనలు విన్న విజయవాడ కోర్టు.. పట్టాభికి 14 రోజుల కస్టడీ విధించింది

Read more RELATED
Recommended to you

Latest news