చిన్న తప్పు..క్షణికావేశం ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలను తీసింది. అంతే కాకుండా అదే కుటుంబంలోని వ్యక్తిని హంతకుడి గా మార్చి జైలుకు పంపింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో చోటు చేసుకుంది. కూతురు తరచూ ఫోన్ చూస్తుందని తల్లి అనేక సార్లు మందలించింది. అయినప్పటికీ కూతురు లో మార్పు రాలేదు. అయితే ఎంత చెప్పినా కూతురు ఫోన్ చూడటం మానడం లేదని తీవ్ర ఆవేశానికి గురైన తల్లి కూతురి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది.
అయితే ఆ సమయం లో ఇంట్లో ఉన్న ఆమె కొడుకు చెల్లిని చంపింది అన్న కోపంతో ఆవేశానికి గురి అయ్యాడు. తల్లి చెల్లి ని చంపింది అనే క్షణికావేశం లో పక్కనే ఉన్న కత్తి తీసుకుని తల్లిని దారుణంగా పొడిచాడు. దాంతో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో అరుపులు కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.