పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు వ‌ద్దు : డీజీపీ

-

గంజాయి రవాణపై రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో డిజిపి గౌతమ్ సవాంగ్ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో గౌత‌మ్ స‌వాంగ్ మాట్లాడుతూ… ఏఓబిలో సాగు అవుతోన్న గంజాయి పై డీజీపీ దృష్టి సారించారు. తెలంగాణ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ ను రంగం సిధ్దం చేస్తున్న‌ట్టు చెప్పారు. సిఎం జగన్ ఆదేశాల మేరకు నెలరోజులుగా గంజాయిపై లోతైన అధ్యాయనం చేశామని గౌతమ్ స‌వాంగ్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారంటూ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆంధ్రా – ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందని తెలిపారు. ఎన్ఐఏ సహకారం తీసుకుని గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో 2 లక్షల 90 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత పదేళ్ల ఎన్నడూ లేనంత గంజాయి…. గడచిన ఏడాదిలో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నర్సాపూర్ లో దొరికిన 3 వేల కేజీల హెరాయిన్ వ్యవహరంతో ఏపికి సంబంధం లేదని డీజీపీ స్ప‌ష్టం చేశారు. ఏపీ గంజాయి అక్రమ రవాణాకు కేంద్రమని 2016లోనే ఇతర రాష్ట్రాలు అన్నాయని…ముంధ్రా పోర్ట్ లో దొరికిన హెరాయిన్ కి రాష్ట్రంతో సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నట్టు తెలిపారు. పోలీస్ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు వద్దని గౌతమ్ స‌వాంగ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news