ఈటల రాజేందర్ కబ్జాదారుడు.. దళితులు ఎవరు ఓటు వేయద్దు : మోత్కుపల్లి

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కబ్జా దారుడని.. దళితుల భూములనే కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు మోత్కూపెల్లి నర్సింహులు . కాబట్టి దళితులు ఎవరు కూడా ఈతలకు ఓటు వేయద్దని పిలుపు నిచ్చారు మోత్కూపెల్లి నర్సింహులు. హుజురాబాద్ టీ ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో మోత్కూపెల్లి నర్సింహులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూపెల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కెసిఆర్ అని.. కెసిఆర్ వల్లనే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్య లు ఆగిపోయాయని పేర్కొన్నారు.

అంటరాని వ్యవస్థ లో దళితులు బతుకుతున్నారని కెసిఆర్ దళిత బంధు ఇస్తున్నాడని.. దళిత బంధు ఓట్ల కోసం కాదన్నారు. దళితుల భూమి కబ్జా చేసిన వ్యక్తి ఈటల అని.. దళితులను మోసం చేసిన వ్యక్తి ఈటల కాబట్టి ఆయనకు ఓటేయద్దన్నారు. వేలకోట్ల రూపాయలు సంపాదించినా వ్యక్తి ఈటల అని.. దళితుల జీవితాల్లో వెలుగులు నిప్పిన వ్యక్తి కెసిఆర్ కాబట్టి టీ ఆర్ ఎస్ కు అండగా ఉందామని చెప్పారు. బీజేపీ వాళ్ళు దళిత బంధు నూ కేవలం పది రోజులు మాత్రమే ఆపగలరని.. దళిత బంధు నూ కాపాడుకోవడం కోసం యువకులు అందరూ ముందుకు రావాలన్నారు. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా లో గెలుస్తున్నారు.. ఓట్లతో గెలిచేది టీ ఆర్ ఎస్ అని పేర్కొన్నారు. ఈటల కు ఓటేస్తే చెత్త కుపలో వేసినట్టేనని తేల్చి చెప్పారు.