కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‏కు గుండెపోటు !

-

కన్నడ పవన్‌ స్టార్‌ పునీత్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ గురించి.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడ చిత్ర పరిశ్రమ లో ఎన్నో సినిమాలు చేస్తూ… ప్రేక్షకుల గుండెల్లో… మంచి స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే… తాజాగా ఈ పవన్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు గుండె పోటు కు గురయినట్లు గా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటా హుటీన బెంగుళూరు లోని విక్రమ్‌ ఆస్పత్రికి తరలించా.. చిక్సిత్స అందిస్తున్నారు.

పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఆస్పత్రి లో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్‌ రాజ్‌ కుమార్ ఆరోగ్యం మరింత విష మించడంతో ఐసీయూ లో చికిత్స అందిస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న నేపథ్యంలో గుండెపోటు వచ్చి నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను విక్రమ్‌ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news