మరో కీలక నిర్ణయం దిశగా ఏపీ సర్కారు… పంచాయతీలకు ట్రాక్టర్లు

-

ఆంధ్ర ప్రదేశ్ సర్కారు మరో కీలక నిర్ణయం దిశగా అడుగుతు వేస్తోంది. గ్రామ పంచాయతీల అభివ్రుద్దికి మరింత చేయూత ఇచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా 2 వేల జనాభా కలిగిన గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గ్రామాల్లో చెత్తాచెదారం తరలించేదుకు, పారిశుద్ధ్య పనులతో పాటు గ్రామాల్లోని మొక్కలకు నీరు అందించేందుకు ఈ ట్రాక్టర్లను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ ట్రాక్టర్ల నిర్వహణ భారం గ్రామపంచాయతీలపై పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

jagan

ఏపీలో 2 వేల జనాభాకు పైబడి 5వేల జనాభా కన్నా తక్కువ ఉన్న గ్రామపంచాయతీలు సుమారుగా 5 వేలకు పైగా ఉన్నాయి. ఈ క్రమంలో దాదాపు 5137 పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఇదే కాకుండా 5 వేల జనాభాకు పైబడి సొంత ట్రాక్టర్లు లేని గ్రామపంచాయతీలు 91 ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఆయా పంచాయతీలకు కూడా ట్రాక్టర్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 5228 గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు అందచేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉంది. గ్రామ పంచాయతీల ఇతర అవసరాలకు కూడా ఈ ట్రాక్టర్లు వినియోగించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news