రష్యా దేశం లో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక తాజాగా ఆదివారం నాడు ఏకంగా కేసుల సంఖ్య 40 వేలకు పైగా నమోదు అయ్యింది. అంతే కాకుండా మరణాలు సైతం పెరిగాయి. ఆదివారం కరోనాతో 1,158 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో దేశ వ్యాప్తంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 వరకు సెలవులు ప్రకటించారు.
దాంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఇక దేశం లో అరవై ఏళ్లు పైబడి వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదిలా ఉంటే దేశం లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మరికొన్ని దేశాల్లోనూ కరోనా విజృంభణ మొదలవుతోంది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు.