Hero Surya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంది.ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా అనే మూవీ కరోనా సమయంలో విడుదల కావడంతో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. తన భార్య జ్యోతిక రక్త సంబంధం మూవీ కూడా అమెజాన్ లో విడుదలై మెప్పించింది. ఇటీవల సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం కూడా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ నిర్ణయంపై కోలీవుడ్ లో సూర్యకు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి.
ఇటీవలే కర్నాటక సర్కార్ పూర్తి స్థాయిలో థియేటర్లను ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో థియేటర్లు రిలీజ్ చేయకుండా ఓటిటీ వైపు మొగ్గు చూపడంతో కర్నాటక డిస్ట్రిబ్యూటర్లు సూర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇక నుంచి సూర్య సినిమాలను బ్యాన్ చేయాలని కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ‘జై భీమ్’ ఓటిటీ రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఉంది. కరోనా టైమ్ లోనే ఆ చిత్రాన్ని అమెజాన్ దక్కించుకొందని, ఆ ఒప్పందం ప్రకారమే ఇప్పుడు రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది.
ఓటీటీ లతో ఒప్పందాల్ని కష్టకాలంలో, ఏం చేయాలో పాలుపోని సమయంలోనే ఈ అగ్రిమెంట్ జరిగినట్లు సూర్య టీమ్ వాదిస్తోంది. ఇందులో హీరో సూర్య తప్పేం లేదని అతని అభిమానులు నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇటీవల తెలుగులో కూడా న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదల సమయంలో కూడా డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లలోనే విడుదల చేయాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.