విశాఖపట్నం కి చెందిన ఓ బిల్డర్ పీతల అప్పిరాజు 47 నిన్న విజయవాడ లో హత్యకు గురయిన సంగతి తెలిసిందే. తల పగలగొట్టి విజయవాడ వాంబే కాలనీలోని తన ఇంట్లో బిల్డర్ ను హత్య చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పిరాజుకు వివాహం జరగ్గా ఆయన కుటుంబం విశాఖపట్నం లో నివాసం ఉంటోంది. అతడి భార్య ఉమ తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుండగా అపిరాజు ఒక్కడే వ్యాపారం నిమిత్తం విజయవాడ లో ఉంటున్నాడు.
ఇటీవలే విశాఖ వెళ్లి 5రోజుల క్రితం విజయవాడ కు చేరుకున్నాడు. అయితే అపిరాజుకు విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ యువతి తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. అంతే కాకుండా హత్య తరవాత అప్పిరాజు ఒంటి పై బంగారం మాయం అయినట్టు చెపుతున్నారు. దాంతో దుండగులు అప్పురాజును హత్య చేశారా అన్న కోణం లో కూడా విచారణ జరుపుతున్నారు.