బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కాగా ఎన్నికల్లో వైసిపి అధిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఎన్నికల ఫలితాలపై బద్వేల్ బిజెపి అభ్యర్థి పనతాల సురేష్ స్పందించారు. దొంగ ఓట్లతోనే అధికార వైసీపీ పార్టీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు. పోలింగ్ బూతులో కి చొరబడ్డారని… వేల కోట్లు ఖర్చు చేశారని సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి ఓట్లను కొనుకున్నారని సురేష్ అన్నారు.
అంతేకాకుండా పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నారు అంటూ సురేష్ మండిపడ్డారు. అంగన్వాడీ కార్యకర్తల నుండి సచివాలయ ఉద్యోగుల వరకు ఎవరిని జగన్ ప్రభుత్వం వదల్లేదని సురేష్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం బద్వేల్ లోనే కాకుండా ఏపీ మొత్తం బిజెపి కి ప్రజలు మద్దతు తెలుపుతారని సురేష్ అన్నారు. ఏపీ ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తమకు మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడానికి బద్వేల్ ఉప ఎన్నిక నాంది కాబోతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గతంలో బద్వేల్ లో బిజెపికి డిపాజిట్లు గల్లంతు కాగా ఉప ఎన్నికల్లో 20 వేలకుపైగా ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే.