దేశంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పంజాబ్ లో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. మాజీ సీఎం, మాజీ కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్ తన పార్టీ పేరును నేడు ప్రకటించాడు. అమరిందర్ తన పార్టీ పేరును ’పంజాబ్ లోక్ కాంగ్రెస్‘ గా ప్రకటించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.
పంజాబ్ సీఎంగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో సీఎం పీఠం నుంచి దించి చన్నీకి సీఎంను కట్టబెట్టిందని అమరిందర్ సింగ్ విమర్శించారు. ఇదే కాకుండా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్దూకూ అమరిందర్ సింగ్ కు పడకపోవడంతో పంజాబ్లో అసలు వివాదం ప్రారంభమైంది. కాంగ్రెస్ చివరకు సిద్దూ సలహాల మేరకే తనను తొలిగించినట్లు అమరిందర్ సింగ్ గతంలో వ్యాఖ్యానించారు. దీంతోొ తాను కాంగ్రెస్ లో ఉండబోనని తేల్చిచెప్పారు. పార్టీ పెట్టేకంటే ముందు బీజేపీ నాయకులను కెప్టెన్ అమరిందర్ సింగ్ పలుమార్లు కలిశారు. దీంతో అమరిందర్ సింగ్ బీజేపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటిన అమరిందర్ సింగ్ గతంలోనే కొట్టిపారేశారు. ప్రస్తుతం పార్టీ పెట్టడంతో 2022 అధికారమే టార్గెట్గా పనిచేయనున్నారు.