తిరుమల తిరుపతి లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని టిటిడి బోర్డు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియం సంస్థలకు ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్టు ఇచ్చినట్టు సమాచారం. ఈ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ అపెక్స్ మోడల్ ప్రాతిపదికన అందిస్తున్నట్టు తెలుస్తోంది. పన్నెండేళ్లు ఈ బస్సులను నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇందులో భాగంగా తిరుపతి తిరుమల మధ్య 50 బస్సులను నడిపేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మిగిలిన 50 బస్సులను తిరుపతి నుండి నెల్లూరు మదనపల్లి, కడప పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీస్ గా నడపాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా తిరుమల ను గ్రీన్ సిటీ గా మార్చేందుకు టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పెరుగుతున్న డీజిల్ ధరల భారం తగ్గడంతోపాటు తిరుమల గ్రీన్ సిటీ గా మారుతుంది. ఇప్పటికే తిరుమలను గ్రీన్ సిటీ గా మార్చేందుకు టిటిడి అనేక కీలక నిర్ణయాలు తీసుకోగా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతామని మరో కీలక నిర్ణయం తీసుకుంది.