Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతోంది. ఏ సీజన్లో లేని విధంగా.. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమయ్యింది. ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ ల్లో సగం మంది కొత్త వాళ్లే. ప్రేక్షకులకు అసలు వాళ్లు పరిచయం కూడా లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చారో సరిగా లేని పరిస్థితి. అలాంటి కంటెస్టెంట్లలో జశ్వంత్ పడాల ( జెస్సీ)ఒకరూ. మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈ ఆంధ్ర అబ్బాయి. తొలుత స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా ఉండేవాడు. అసలు ఎందుకు తీసుకున్నారని, వెంటనే ఎలిమినేట్ చేసేయ్యడని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
పలుసార్లు కింగ్ నాగ్ కూడా గేమ్ మీద ఫోకస్ చేసి.. అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వత తన గేమ్ ఫ్లాన్ మొత్తం మార్చేశాడు. తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ.. ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలబడటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఉన్నట్లుండి బిగ్ బాస్ హౌస్ లో జెస్సీ ఎలిమినేట్ అవ్వబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.
వివరాల్లోకెళ్తే.. బిగ్ బాస్ 10వ వారం నామినేషన్స్ లో భాగంగా.. జెస్సీని జైల్లోకి పంపించారు. అయితే.. చాలా సేపు నిలబడి ఉండటంతో ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయాడట. దీంతో ఎమెర్జన్సీ రూమ్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. గత వారం రోజుల నుంచీ జెస్సీ ఆరోగ్యం సరిగా లేదు. ఆయన వర్టిగో సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్న వారికి చూపు మందగించడం, చెవులు సరిగ్గా వినిపించక పోవడం, ఎక్కువ సేపు నిలబడటం సేఫ్ కాదు.
గత 15 రోజులుగా ఈ సమస్యతో బాధ పడుతున్నాడు జశ్వంత్. మధ్యలో ఒకట్రెండు సార్లు బిగ్ బాస్ ఇంటికి డాక్టర్ వచ్చి అతడిని ట్రీట్ చేసి వెళ్ళాడు. అయినా కూడా జెస్సీ ఆరోగ్యం పూర్తిస్థాయిలో కుదుట పడలేదు. హాస్పిటల్ కి తీస్కుని వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. దీంతో జెస్సీని హౌస్ నుంచి పంపిచేయాలని బిగ్ బాస్ టీం డిసైడ్ అయ్యినట్టు టాక్. గత సీజన్ లో గంగవ్వకి హెల్త్ ప్రాబ్లమ్ రావడంతో .. ఆమెను షో మధ్య నుంచే ఎలిమినేట్ చేసేశారు. అలాగే, నోయల్ కూడా కాళు నొప్పితో ఇంటి నుంచీ బయటకి వచ్చేశాడు.
ఇప్పుడు ఈసీజన్ లో జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ తో ఇంటి నుంచీ బయటకి వచ్చేస్తాడా? లేదా షో లో కంటిన్యూ అవుతాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈవారం జెస్సీ ఇంటి నుంచీ వచ్చేస్తే , ఈవారం ఎలిమినేషన్ ఉండదనే చెప్తున్నారు. నామినేట్ అయిన సభ్యులందరూ సేఫ్ అయినట్టే.