సుకన్య సమృద్ధి యోజనలో డబ్బులు పెడితే ఈ నష్టాలు కలుగుతాయి తెలుసా..?

-

చాల మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. అయితే స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. చాల మంది ఈ స్కీమ్ లో డబ్బులని పెడుతూ వుంటారు.

 

మీరు కూడా దీనిలో డబ్బులు పెడుతూ ఉంటే ఈ విషయాలని తెలుసుకోవాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆడ పిల్లలకు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హత ఉంటుంది. దీనిలో పదేళ్లలోపు అమ్మాయిలు చేరొచ్చు. ఈ పథకంలో చేరడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని నష్టాలూ వున్నాయి.

ఈ స్కీమ్ లో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది కేంద్రం. 9 శాతానికి పైగా వడ్డీ గతంలో వచ్చేది. కానీ ఇప్పుడు 7.6 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అలానే దీనిలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలి. 15 ఏళ్లు డబ్బులు పెట్టాలి. దీనితో మధ్యలో ఆదాయం తగ్గచ్చు.

అదే విధంగా ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అంటే చాలా ఏళ్లు వేచి ఉండాలి. పూర్తిగా డబ్బులు తీసుకోవాలంటే మాత్రం 21 ఏళ్లు తప్పక ఆగాలి. పైగా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ సేవలు పొందలేం. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ లేదు. ఏమైనా చెక్ చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ చూడాలన్న తప్పకుండ బ్యాంక్ కి వెళ్ళాలి.

Read more RELATED
Recommended to you

Latest news