యూట్యూబ్ తాజాగా సరి కొత్త ఫీచర్ తీసుకు వచ్చింది. ఇక నుంచి యూట్యూబ్ లో డిస్ లైక్ లు అనేవి కనిపించవు. డిస్ లైక్ లు కనిపించకుండా యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. దాని కోసం యూట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసు కువచ్చింది. ఈ ఫీచర్ వల్ల డిస్ లైక్ లు అనేవి అందరికీ కనిపించవు. డిస్ లైక్ లో కేవలం విడీయో ని క్రియేట్ చేసిన వారికే మాత్రమే ప్రయివేట్ గా కనిపిస్తుంది.
అయితే యూట్యూబ్ లో కొత్త గా వచ్చే వారి క్రియేటివిటీ ని ప్రోత్సహించాలనే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. అందు కోసం కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. అయితే గతంలో చాలా విడియో లకు లైక్ ల కన్న.. డిస్ లైక్ ల సంఖ్య నే ఎక్కువ గా ఉండేది. ముఖ్యం గా కొన్ని సినిమాలకు, టీజర్లకు, పాటలకు, షార్ట్ ఫీల్మ్ కు డిస్ లైక్ లు ఎక్కువగా వచ్చేవి. అయితే ఇప్పుడు యూట్యూబ్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డిస్ లైక్ లు ఎన్ని వచ్చినా.. అవి పబ్లిక్ గా కనిపించవు.