Prabhas: ‘బాహుబలి’ సీరిస్ తో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అనంతరం అదే స్థాయిలో దూసుకపోతున్నాడు. ఈ క్రమంలో పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘ఆదిపురుష్’ షూటింగ్‌కి రీసెంట్‌గా క్లాప్ కొట్టేశారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ – కె’ పూర్తి చెయ్యాల్సి ఉంది.
తర్వాత ప్రభాస్ తన 25వ చిత్రాన్ని.. సందీప్ వంగ డైరెక్షన్‌లో చేయబోతున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి చాలా విభిన్నంగా ‘స్పిరిట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. భారీ యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం.
ఈ క్రమంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్ ఏవరనేది చాలా ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సౌత్ కొరియన్ బ్యూటీ సాంగ్ హ్యే క్యో తో ప్రభాస్ రొమాన్స్ చేయడానికి సిద్దంగా ఉన్నాడని టాక్. ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ఫీల్మ్ నగర్ లో టాక్.
22 ఏళ్ల సాంగ్ హ్యే క్యో హోస్ట్‌గా, మోడల్‌గా, బ్యూటిఫుల్ యాక్టరేస్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘స్పిరిట్’ పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి.. ఆ మాత్రం ఉండాలని మరి ఫ్యాన్ భావిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో లేడీ విలన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూన్ నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.