బిడ్డ నలుపురంగులో పుట్టిందని DNA టెస్ట్ చేయించారు.. అసలు విషయం అప్పుడే తెలిసింది..!

-

మనదేశంలో అంతగా లేదు కానీ.. అమెరికా వంటి కంట్రీస్ లో ఐవీఎఫ్ ప్రక్రియలో బిడ్డను కనటం చాలా సాధారణం అయిపోయింది. ఇలా చేసే కాలీఫోర్నియాకు చెందిన మహిళ పరాయి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ నల్లగా ఉందని అనుమానం వచ్చిన ఆ జంట డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నారు..అందులో బయటపడింది ఈ నిజం. అసలు ఈ ప్రక్రియ అంతా ఎలా జరిగిందంటే..

కాలిఫోర్నియాకు చెందిన డాఫ్నా కార్డినల్, ఆమె భర్త అలెగ్జాండర్ కార్డినల్‌లకు మొదటి సంతానం ఒక ఆడపిల్ల. 2018లో వీళ్లు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా రెండో బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో డాఫ్నా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. కానీ, ఆ పిల్లకు తమ పోలికలు ఏమి రాలేదు. అలెగ్జాండర్ కార్డినల్‌కు సందేహం వచ్చింది. ఆ బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించారు. దీంతో అసలు విషయం తెలిసింది.

ఐవీఎఫ్ ప్రక్రియలో మహిళ అండాలను లాబొరేటరీలో పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఫలదీకరణం చెందిన అండాలను ఆ తర్వాత మహిళ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇది అసలు ప్రక్రియ. ఇలా చేసే క్రమంలో వేరొక పురుషుడి వీర్యంతో ఫలదీకరణం చెందిన అపరిచిత మహిళ అండాన్ని డాఫ్నా గర్భాశయంలో ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ కంప్లీట్ గా స్పెర్మ్ మారిపోయింది.

అయితే ఐవీఎఫ్ ప్రక్రియ సమయంలో అండాలు తారుమారవ్వడం ఇదేం మొదటిసారి కాదు. మీరు చూసే ఉంటారు. బాలీవుడ్‌లో ఈ గందరగోళంపై అక్షయ్ కుమార్, కరీనాకపూర్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా కూడా వచ్చింది.

నలుపురంగులో ఉన్న ఆడపిల్లను చూసిన తర్వాత తన భర్త నోటిమాట రాలేదని, షాక్‌లో కూలబడ్డారని డాఫ్నా తెలిపారు. వేరొక మహిళ బిడ్డకు తాను జన్మనివ్వడం, నాలుగు నెలల పాటు ఆ బిడ్డకు పాలిచ్చి, తర్వాత వదులుకోవాల్సి రావటం అంతా మానసికంగా తమను ఎంతో కుంగదీశాయని బాధిత తల్లి పేర్కొన్నారు.

ఐవీఎఫ్ ల్యాబ్‌పై కేసు నమోదు:

కార్డినల్ దంపతులు లాస్ ఏంజెల్స్‌కు చెందిన ది కాలిఫోర్నియా సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్ అండాన్ని ఫలదీకరణం చేసే పై కేసు పెట్టారు. ఈ రెండు సంస్థలూ వైద్యపరమైన అవకతవకలకు పాల్పడ్డాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, మోసపూరితంగా నిజాలను దాచిపెట్టాయని దంపతులు ఆరోపించారు.

పిల్లల్ని మార్చుకునేందుకు పరస్పర అంగీకారం..

కార్డినల్ దంపతులకు బిడ్డ పుట్టిన వారంలోనే మరొక బిడ్డకు జన్మనిచ్చిన దంపతుల వివరాలను సేకరించేందుకు సిసిఆర్‌హెచ్ సహాయం చేసింది. అలా వారు తమ సొంత బిడ్డ గురించి తెలుసుకోగలిగారు. అయితే, అప్పటికి బిడ్డ పుట్టి నాలుగు నెలలు దాటింది.
రెండు జంటల మధ్యా అనేక చర్చలు జరిగాయి. ఒకరు కన్న బిడ్డను మరొకరు అధికారికంగా మార్చుకునేందుకు 2020 జనవరిలో అంగీకారం కుదిరింది.

అయితే ఈ ఘటన ఈ రెండు జంటలను మానసికంగా చాలా కుంగదీశాయి. ఈ సంఘటన తర్వాత ఆందోళన, ఒత్తిడి, పీటీఎస్‌డి లాంటి సమస్యలకు మానసిక ఆరోగ్య చికిత్స తీసుకున్నట్లు వారిద్దరూ వెల్లడించారు.అయితే, ఈ వ్యవహారంలో బాధితులైన మరో జంట కూడా కేసు వేయాలని నిర్ణయించుకున్నట్లు కార్డినల్ దంపతుల తరుపున కేసు వాదిస్తున్న న్యాయవాది ఆడం బి వోల్ఫ్ చెప్పారు. అయితే, ఆ జంట వివరాలను గోప్యంగా ఉంచాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇలాంటి ఘటన 2019లోనూ ఒకటి జరిగింది. ఆ కేసులో అయితే బిడ్డను తిరిగి ఇచ్చేందుకు ఆ తల్లి ఒప్పుకోలేదు. చివరకి కోర్టు ద్వారా బిడ్డను అసలైన తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ప్రక్రియతో లాభం ఎంతుందో అలానే ఇలాంటి పొరపాట్ల వల్ల నష్టం కూడా లేకపోలేదు.

– TRriveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news