ఒకే వేదిక ఒకే క‌ల‌ర్ జెర్సీ క‌ప్ మాత్రం వేరు – హ‌ర్భ‌జ‌న్

-

టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా కు సెల‌బ్రెటీల నుంచి ప్రశంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా ఆస్ట్రేలియా కు త‌న‌దైన శైలీలో ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపంచాడు. 2021 సంవ‌త్సరం మొత్తం కూడా యేల్లో క‌ల‌ర్ దే న‌ని అన్నాడు. ఒకే వేదిక‌న ఒకే క‌ల‌ర్ జెర్సీ ఉన్న రెండు జ‌ట్లు రెండు విభిన్న టోర్న‌మెంట్ ల‌ను గెలిచాయ‌ని అన్నాడు.

కాగ 2021 ఐపీఎల్ లో యేల్లో క‌ల‌ర్ జెర్సీ ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఐపీఎల్ 2021 ఫైన‌ల్ మ్యాచ్ దుబాయ్ వేదిక గానే జ‌రిగింది. అలాగే టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కూడా దుబాయ్ వేదిక గానే నిర్వ‌హించారు. దీంతో టీ ట్వంటి ప‌ప్రంచ క‌ప్ టోర్న మెంట్ తో పాటు ఐపీఎల్ 2021 టోర్న‌మెంట్ ల‌ను పోల్చుతూ ఆస్ట్రేలియా కు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news