వైరల్ : షూస్ లో బీర్లు తాగుతూ.. ఆస్ట్రేలియా క్రికెటర్ల రచ్చ..

-

టి20 ప్రపంచ కప్ 2021 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజీలాండ్ జట్టుపై ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు… ప్రపంచ కప్ 2021 విశ్వవిజేతగా నిలిచింది. జట్టు సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించారు.

అయితే నిన్న టి 20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్లు.. సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేసుకున్నారు. బీరు తాగుతూ ఎంజాయ్ చేసారు. కాలికి ఉన్న షూ తీసి అందులో బీరు పోసుకుని తాగారు క్రికెటర్లు. స్పెషల్ గా ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ మ్యాచ్ మాత్య్యూ వెడ్.. ఏకంగా తన షూలో బీరు పోసుకొని తాగగా… ఆ తర్వాత ఆల్ రౌండర్ స్టోనీస్ అదే షూలో బీరు పోసుకుని తాగుతూ కనిపించాడు. అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఇదెక్కడి సెలబ్రేషన్స్ అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news