ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 117 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా మహమ్మారి బారిన పడి విశాఖ కు చెందిన ఒకరు మృతి చెందారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 21,360 మంది ప్రజలకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో కేవలం 117 మంది కే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి సోకిన వారి సంఖ్య 20,67,200 కు చేరింది.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 241 మంది కరోనా మహమ్మారి ని జయించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 2,961 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గతం తో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. అయితే కరోనా విషయంలో రాష్ట్ర ప్రజలు ఆజగ్రత్త పాటించవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్త తో ఉన్న మూడో వేవ్ రావడం ఖాయమని తెలిపారు. అయితే అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ మన దరికి రాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక అధికారులు తెలిపారు.