గుజరాత్ లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్…

-

గుజరాత్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడోచోట డ్రగ్స్ పట్టుబడటం చూస్తున్నాం. అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందాకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో రూ. 600 కోట్ల విలువైన సుమారు 120 కిలోల హెరాయిన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు పట్టుకున్నారు. గత ఐదు నెలల నుంచి గుజరాత్ లో రూ.24,800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

అలాగే గత సెప్టెంబర్‌ నెలలో కచ్‌లోని ముంద్రా పోర్టులో 3వేల కిలోల డ్రగ్స్‌ను డీఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు. దీని విలువ రూ.21 వేల కోట్ల ఉంటుందని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన డ్రగ్స్ ను అధికారులు గతంలో పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ కు లింకులు ఉండటం అప్పట్లో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news