2.ఓ టీజర్ డేట్.. ఈసారి కన్ఫాం..!

-

సౌత్ లో క్రేజీ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్, సూపర్ స్టార్ రజిని కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2.ఓ మొదలు పెట్టిన తర్వాత రజిని కబాలి, కాలా రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. కొన్నాళ్లుగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న 2.ఓ సినిమా టీజర్ ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చింది.

సెప్టెంబర్ 13న 2.ఓ టీజర్ వచ్చేస్తుంది. టీజర్ తో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించేలా 2డి, 3డి ఎక్స్ పీరియెన్స్ కలిగేలా ఈ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో రజినికి ధీటుగా అక్షయ్ కుమార్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా ఎమీ జాక్సన్ నటిస్తుంది.

మరి ఈసారి చెప్పిన టైంకు టీజర్ వచ్చింది అంటే లెక్క సరిపోయినట్టే. ఇక ఈ ఇయర్ దీవాళికి 2.ఓ రిలీజ్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 13న వినాయక చవితి నాడు వచ్చే టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news