బాలయ్య కు అరుదైన గౌరవం.. ‘గోల్డెన్ లెగసి’ అవార్డు..!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే తన 50 ఏళ్ల నటన జీవితం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బాలీవుడ్ భారీ ఈవెంట్ నిర్వహించింది. 50 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన బాలయ్య ఎన్నో అవార్డులను అందుకున్నారు. తాజాగా తన 50 ఏళ్ల నట ప్రస్థానానికి స్పెషల్ అవార్డును అందుకున్నారు. 

యూఏఈలోని అబుదాబిలో ఐఫా వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఐఫా తరపున బాలకృష్ణకు “గోల్డెన్ లెగసీ” అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ చేతుల మీదుగా “గోల్డెన్ లెగసీ” అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. “నా 50 ఏళ్ల నట ప్రస్థానానికి ఐఫా నాకు ఈ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నాటి తోటి స్టార్స్ తో మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుంది. నేను దానిని చాలా ఎంజాయ్ చేస్తాను” అని తెలిపారు బాలయ్య. 

Read more RELATED
Recommended to you

Latest news