ఆ దేశంలో రేపిస్టులు.. ఇక అందుకు పనికిరారు

-

లైంగిక నేరాలకు పాల్పడే వారికి కెమికల్ కాస్ట్రేషన్ విధింపు బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే రేపిస్టులను సెక్స్‌కు పనికి రాకుండా చేస్తారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో అత్యాచారాలు, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేరాల నియంత్రణ కోసం ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. రేపిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రేప్ కేసుల్లో విచారణను సత్వరంగా పూర్తి చేసి, దోషులకు కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టడంపై ఏడాది క్రితమే పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆర్డినెన్స్‌ కూడా జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇకమీదట ఆ దేశంలో తరుచూ లైంగిక వేధింపులకు పాల్పడే, రేపిస్టులను కెమికల్ కాస్ట్రేషన్ ద్వారా సెక్స్‌కు పనికిరాకుండా చేస్తారు.

pakistan prime minister imran khan warns india

Read more RELATED
Recommended to you

Latest news