ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాల కారణంగా కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని వంతెన కుప్ప కూలింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లను ఎత్తడంతో వరద నీరు పోటెత్తింది.ఇక గత రెండు రోజుల నుండి వంతెన వద్ద వరద నీరు ప్రమాదకరం గా ప్రవహిస్తోంది. అయితే నీరు అంచుల వరకూ చేరడం తో వంతెన పూర్తిగా నానిపోయింది. క్రమంలో వంతెన అర్ధరాత్రి ఒక్కసారి కుప్ప కూలింది.
,,,,Papagni bridge collapsedఇక ఈ బ్రిడ్జ్ అనంతపురం నుండి కడపకి వెళ్లే జాతీయ రహదారి పై ఉండటం తో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఈ మార్గం లో వెలసిన వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. అంతే కాకుండా రాకపోకలు మళ్లీ పునరుద్దరించాలంటే నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక భారీ వర్షాలతో సీఎం జిల్లాల కలెక్టర్ లను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.