ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా.. ఏయే దేశాలపై అంటే..

-

కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ట్రావెల్ బ్యాన్ దిశగా అడుగులు వేస్తున్నది. కొత్త వేరియంట్ ఆ దేశంలోకి ప్రవేశించకుండా ఉండటం కోసం ఎనిమిది ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు రాకపోకలు సాగించకుండా ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు ప్రకటించింది.

కొత్త వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాతోపాటు బోట్స్‌వానా, జింబాంబ్వే, నమీబియా, లెసోథో, ఎస్వతిని, మొజాంబిక్, మలావి తదితర దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు తెలిపింది. ఇది సోమవారం నుంచి అమలులోకి వస్తుందని, పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రయాణ ఆంక్షలు ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా పౌరులు, శాశ్వత నివాసితులకు వర్తించవు అని తెలిపింది. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైందిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news