అప్పులపై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా అప్పులు తెచ్చుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. ఎఫ్ ఆర్ బి ఎం చట్టానికి సవరణలు చేసిన ఏపీ ప్రభుత్వం.. చట్ట సవరణ కు అసెంబ్లీలో కూడా ఆమోదించుకుంది జగన్ సర్కార్. కార్పొరేషన్ల ద్వారా అదనంగా లక్షా ఇరవై వేల కోట్లు రుణం తీసుకునేందుకు చట్ట సవరణ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఈ చట్ట సవరణ ద్వారా 90 శాతం ఉన్న గ్యారెంటీ పరిమితిని 180 శాతానికి పెంచింది ఏపీ ప్రభుత్వం. రుణ సేకరణకు కార్పొరేషన్లకు ప్రభుత్వం అదనపు గ్యారెంటీ ఇచ్చేందుకు సౌలభ్యం ఉండనుంది. ఎఫ్ ఆర్ బి యం చట్టంలోని సెక్షన్ 9 క్లాస్ డి కి సవరణ చేసింది ప్రభుత్వం. అయితే ఇలా రుణాలు తీసుకువస్తే ఆర్థిక పరిస్థితి మరింత తలకిందులు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.