ఆంధ్ర ప్రదేశ్ కు వర్ష ముప్పు ఇంకా తప్ప లేదు. ఇప్పటి కే ఉపరితల ఆవర్తనం ప్రభావం తో నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రేపు అండమాన్ సముద్రం లో అల్ప పీడనం ఏర్పడనుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. ఈ అల్ప పీడనం రెండు రోజుల్లో తీవ్ర మైన అల్ప పీడనం గా బలపడే అవకాశం ఉందని తెలిపారు.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపూరం, చిత్తూరు జిల్లా లో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే కర్నూలు, గుంటూరు జిల్లా లో పలు చోట్ల కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగ ఇప్పటి కే ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాల తో తడిసి ముద్దాయింది. అంత కాకుండా కొన్ని చెరువులు కూడా తెగి పోయాయి. అలాగే కడప జిల్లా లోని అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కూడా తెగి పోయింది. వీటి వల్ల ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి అధిక మొత్తం ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది.