ఇవాళ ఉదయమే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే… కేంద్ర ప్రభుత్వం ముందుగా చెప్పిన విధంగానే… పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే…. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశ పెట్టారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
అయితే… లోక్ సభలో విపక్షాల తీరుతో… మూజువాణి ఓటు తో బిల్లును చర్య లేకుండానే ఆమోదించింది లోక్ సభ. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదం అనంతరం… లోక్ సభను స్పీకర్ ఓమ్ బీర్లా వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది.
ఇక అంతకు ముందు లోక్ సభలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది టీఆర్‌ఎస్ పార్టీ. దీనిపై వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చారు టీఆర్‌ఎస్ ఎంపీలు.