పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ వీడియోల ద్వారా పాలపులారిటీ సంపాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆయన వీడియోలపై విమర్శలు వచ్చాయి. అసభ్య పదజాలం వివాదాస్పద అంశాలపై ఆయన మాట్లాడటంతో సీబీఐ ఆయన ఆయన పై విచారణ కొనసాగిస్తుంది. కాగా తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎయిడ్స్ నుండి కరోనా వరకూ అనువనువూ మాట్లాడే కెపాసిటీ నాకుంది అని అన్నారు. నేను నా ఇంట్లో కూడా భూతులే మాట్లాడుతా..పనిలోకూడా భూతులే మాట్లాడుతానని చెప్పారు.
తన సోషల్ మీడియాలు అన్నీ సీబీఐ బ్లాక్ చేయించిందని మళ్లీ కొత్త యూట్యూబ్ ఛానల్ తో వస్తానని చెప్పారు. తాను వైసీపీ సపోర్టర్ కాదని అన్నారు. తనతో పాటూ అరెస్ట్ అయ్యిన వారిలో ఎవరూ తనకు తెలియదని అన్నారు. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని తనను అరెస్ట్ చేసినా కూడా వైసీపీ సపోర్ట్ అవసరం లేదని అన్నారు. తాను రాజకీయాల్లో పనికిరానని..నాయకుడిగా పనికి రానని చెప్పారు. నా వ్యాఖ్యలకు బాధపడ్డవారందరికీ సారీ చెబుతున్నాను..కానీ అందులో ఉన్న పరమార్థంను గ్రహించాలంటూ పేర్కొన్నారు. తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పారు. చంద్రబాబు ఏడ్చినప్పుడు తాను పాజిటివ్ గా విడీయో పెట్టానని అన్నారు. అరెస్ట్ చేసినా నేను బయటపడతానని పంచ్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.