ధాన్యం నిల్వ‌లు పెరిగితే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి – సీఎం కేసీఆర్

-

కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ధాన్యం నిల్వ‌లు పెరిగితే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ప్ర‌త్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్య‌త కూడా కేంద్ర ప్ర‌భుత్వాని దే అని తెలిపారు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాల పై నెట్ట‌డం స‌రి కాద‌ని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం చెప్పెవ‌న్నీ కూడా అబ‌ద్ధాలే అని సీఎం కేసీఆర్ అన్నారు.

వ‌రి ధాన్యం విష‌యం లో కేంద్ర ప్ర‌భుత్వం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించారు. నిల్వ‌లు పెరిగాయ‌ని చెప్ప‌డం హాస్య‌స్ప‌దం అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న చిల్ల‌ర రాజ‌కీయాల వ‌ల్ల దేశ వ్యాప్తం గా రైతులు అయోమాయం లో ప‌డ్డార‌ని అన్నారు. రైతు వ్య‌తిరేక నిర్ణాయ‌లు తీసుకోవ‌డం లో కేంద్ర ప్ర‌భుత్వం ముందు ఉంద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం లాంటి ప్ర‌భుత్వాన్ని గ‌తంలో ఎన్న‌డూ చేడ‌లేద‌ని అన్నారు. అలాగే ఇక ముందు కూడా చూడ‌బోలేను అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news