బ్రేకింగ్ : రక్త దానం చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఎండీ హోదాలో మొదటి సారిగా

-

హైదరాబాద్‌: ఎంజీబీఎస్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్‌ క్యాంపును ప్రారంభించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ రక్త దానం చేశారు. ఆర్టీసీ ఎండీ హోదాలో…ఇప్పటి వరకు ఎవరు రక్త దానం చేయలేదు. మొదటిసారిగా సజ్జనార్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీలో బ్లడ్ డోనెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని వెల్లడించారు. తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ వారికి బ్లడ్ ఎంతో అవసరమని… నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డోనేట్ చేశారన్నారు.

ఆయన చేత నర్సంపేటలో బ్లడ్ డోనేట్ కాంప్ ప్రారంభమైందని… ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేయాలని పిలుపు నిచ్చారు. ప్రజలంతా బ్లడ్ డోనేట్ చేయాలని కోరుతున్నానని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని… కొత్త వేరియంట్ పై బయపడాల్సిన అవసరం లేదన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news