ఇంటివాడైన స్టార్ క్రికెటర్ రాహుల్ తెవాతియా

-

రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాతియా ఒక ఇంటివాడు అయ్యాడు. ఢిల్లీకి చెందిన రిది పన్నును వివాహం చేసుకున్నారు. పెండ్లికి సంబంధించిన ఫొటోలను స్వయంగా రాహుల్ తెవాతియానే పోస్ట్ చేశారు. ప్రస్తుం అవి వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ తెవాతియా, రిది పన్నుకు మధ్య ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే.

వివాహ వేడుకకు స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, నితిష్ రాణా, యజువేంద్ర చాహల్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కీలకమైన ప్లేయర్‌గా రాహుల్ తెవాతియా ఎదిగాడు. ఐపీఎల్-2020లో పంజాబ్ కింగ్స్‌పై వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదడంతో ఒక్కసారిగా రాహుల్ తెవాతియా పేరు మారుమోగింది.

Read more RELATED
Recommended to you

Latest news