తెలంగాణ రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ లోటు తో కొనసాగుతుండటం అలాగే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అనిపించకపోవడం కారణంగా ఈ భారమంతా తెలంగాణ వినియోగదారుల పైన ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ చార్జీల షాక్.. తప్పేలా కనిపించడం లేదు.
డి స్కాములు సమర్పించిన ఏ ఆర్ ఆర్ ఈ అంశాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతం 2021-22, వచ్చే 2022-23 ఆర్థిక సంవత్స రాలకు కలిపి డిస్కాములు ఏకంగా… రూ. 21550 కోట్ల లోటు ను కలిగి ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలానికి గాను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఈ ఆర్ సి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల లో… డిస్కాంలు ఈ విషయాన్ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పోనూ… కూడా ఇంత భారీ లోటుతో ఉన్నట్లు తెలిపాయి. టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాకే తాము ముందుకు వెళతామని టీఎస్ ఈఆర్‌సీ చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. వాస్తవ స్థితిగతులపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభావ వర్గాల నుంచి అభ్యంతరాలు సేకరించాకే చార్జీల పెంపుపై నిర్ధారణకు వస్తామన్నారు. అయితే.. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి కరెంట్ ఛార్జీలు పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.