జపాన్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు..

-

మరోసారి భూకంపంతో జపాన్ భయాందోళనకు లోనైంది. జపాన్ ఆగ్నేయ ప్రాంతం అతిపెద్ద ద్వీపం హోన్షు లొ రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. గురువారం ఈ భూకంప సంభవించింది. భూకంపం కేంద్రం వాకయామా ప్రిఫెక్చర్ వద్ద 20 కిలోమీటర్ల (12 మైళ్ల కంటే ఎక్కువ) లోతులో కేంద్రీక్రుతం అయింది. క్యుషు మరియు షికోకు దీవులతో సహా 23 ప్రిఫెక్చర్‌లలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.

జపాన్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్లో భూకంప క్రియాశీల జోన్‌లో ఉంది. ఇక్కడ తరుచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా 15,000 మంది మరణించారు. పుకుషీమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం కూడా ఏర్పడింది. అణుధార్మిక పదార్థాలు లీకేజీ ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news