తెలంగాణ లో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆయిల్ ఫామ్ పంటను పండించేవారికి రాయితీలు కూడా ఇస్తామని ప్రకటించింది. పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ పండిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక ఇప్పటికే తెలంగాణ లో 50 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతోంది కూడా. అయితే తాజాగా ఆయిల్ ఫామ్ రైతులకు ఓ శుభవార్త చెప్పింది.
2020-2021 సంవత్సరానికి గానూ ఆయిల్ ఫామ్ గెలల ధర రూ.800 నుండి రూ.900 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.17 వేలు ఉంది…ఇప్పుడు ఇది 17,800 నుందిన్17,900 అయ్యే అవాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2013 లో ప్రకటించిన ఫార్ములా అధారంగా ఆయిల్ రికవరీ శాతం బట్టి ధరలను నిర్ణయించారు. ఇక దేశం లో ఎక్కువగా నూనెలు దిగుమతి అవుతున్నాయని….అందువల్లే తెలంగాణ సర్కార్ ఆయిల్ ఫామ్ సాగు దిశగా మొగ్గు చూపుతుంది అన్న సంగతి తెలిసిందే.