ప్రపంచాన్ని ఓమిక్రాన్ కేసులు కలవరపెడుతున్నాయి. ప్రపంచంలో పలు దేశాల్లో కలిపి దాదాపు 900 పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాల్లో కేసుల సంఖ్య 2 వందలను దాటింది. మనదేశంలో కూడా కేసుల సంఖ్య 21కి చేరింది. దీంతో ప్రపంచ దేశాలని దీని తీవ్రత కారణంగా వణుకుతున్నాయి. ఇప్పటికే 41 దేశాలకు అతి తక్కువ కాలంలో వ్యాపించింది.
ఇదిలా ఉంటే ఓమిక్రాన్ వల్ల ఆసుపత్రుల్లో చేరుతున్నది తక్కువే అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అన్నారు. తీవ్ర వ్యాధి లక్షణాలలో ఆసుపత్రుల్లో చేరేవారి తక్కువగానే ఉంటున్నట్లు వెల్లడించాడు. ఈ వేరియంట్ కారణంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోకపోవడం విశేషం. ప్రపంచంలో 30 దేశాలకు ఓమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికా దేశం నుంచే వ్యాపించింది.