రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్ కు రానున్నాడు. ప్రతి ఏట రెండు దేశాల మధ్య జరిగే వార్షిక సదస్సు లో భారత ప్రధాని మోడీ తో పుతిన్ భేటీ కానున్నారు. అలాగే ఈ సమావేశం తో రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడేందుకు అవకాశం ఉందని ఇరు దేశాల నేతలు భావిస్తున్నారు. ఈ భేటీ లో భాగం గా రెండు దేశాల మధ్య కీలక మైన 10 ఇప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయనున్నారు.
సమాచారం, రక్షణ, పర్యావరణ మార్పుల తో పాటు వాణిజ్యం తో సహా మొత్తం 10 ఒప్పందాల పై ఇరు దేశాల నేతలు సంతకాలు చేయనున్నారు. అయితే వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశం కానున్నారు. దీని తర్వాత సాయంత్రం 5:30 లకు ఢిల్లీ లో ఉన్న హైదరాబాద్ హౌస్ లో మోడీ తో పుతిన్ సమావేశం అవుతారు. ఈ సమావేశం తర్వాత ఉమ్మడి ప్రకటన ఉంటుంది. ఈ ఉమ్మడి ప్రకటన కు మీడియా కు అనుమతి లేదు. కేవలం ఒక కెమెరా మెన్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. కాగ తిరిగి 9:30 గంటలకు పుతిన్ తిరిగి రష్యాకు ప్రయాణం అవుతారు.