ఈపీఎఫ్ఓ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ గురించి తెలుసా..? రూ.7 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు..

-

ఈపీఎఫ్ ఉద్యోగులకు శుభవార్త. జీతం పొందే ఉద్యోగుల కోసం విశ్వసనీయ పెట్టుబడి పథకం ఉంది. ఉద్యోగులు డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులు అర్హుల కావచ్చు. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా.. రూ. 7 లక్షల వరకు జీవిత బీమా ప్రయోజనాలు పొందవచ్చు. బీమా ప్రయోజనాలే కాకుండా EDLI పథకం ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. దీని కింది ఖాతాదారుడు మరణించిన సందర్భంతో అతని కుటుంబానికి లేదా వారసుడికి రూ. 7 లక్షల వరకు బీమా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. గతంలో ఇది రూ. 6 లక్షల వరకే ఉండేది.. అయితే ఈ ఏడాది ఎప్రిల్ లో దీన్ని రూ. 7 లక్షలకు పెంచారు. ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల్లో నిరంతర సేవలో ఉంటే మినిమం అష్యూర్డ్ బెన్ ఫిట్ కింద ఈ మొత్తం రూ. 2.5 లక్షలు పొందవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించే అవసరం కూడా లేదు. EDLI స్కీమ్‌ని పొందేందుకు EPFO ​​ఖాతాదారులు విడిగా నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. బదులుగా, వారు సభ్యులు అయిన తర్వాత దీనికి అర్హులు అవుతారు. ఈ ప్లాన్ కింద ప్రయోజనాలు నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాకు లేదా ఉద్యోగి చట్టపరమైన వారసుడి ఖాతాకు లింక్ చేయబడతాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news