పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడి గూడెం గ్రామంలో అంతుచిక్కని జ్వరాలతో నలుగురు విద్యార్థులు మరణించారు. మరో 50 మంది విద్యార్థులు ఆస్పత్రి లో వైద్యం తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అంతు చిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు, నిర్లక్ష్యపు జగన్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడి గూడెం గ్రామంలో అంతుచిక్కని జ్వరాలతో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఇప్పటివరకూ నలుగురు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏభై మందికి పైగా విద్యార్థులు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నివారాలుగా పదిహేనేళ్లలోపు వయస్సు గల విద్యార్థిని విద్యార్థులు వేర్వేరు లక్షణాలు, జ్వరాలతో బాధపడుతుంటే, వైద్యారోగ్యశాఖ-విద్యాశాఖాధికారులు కనీసం..పట్టించుకునే స్థితిలో లేకపోవడం దారుణమని నిప్పులు చెరిగారు. నలుగురు విద్యార్థులు చనిపోతే, అంతుచిక్కని జ్వరాలు ఎందుకొస్తున్నాయో కూడా దృష్టిసారించే తీరికలేని ప్రభుత్వం ఇంకెంతమంది పిల్లలు చనిపోతే స్పందిస్తుందని ఫైర్ అయ్యారు.
అంతుచిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు, నిర్లక్ష్యపు @ysjagan సర్కారు చేసిన హత్యలే. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడి గూడెం గ్రామంలో అంతుచిక్కని జ్వరాలతో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఇప్పటివరకూ నలుగురు మృత్యువాతపడి..,(1/3) pic.twitter.com/Dkh05VXx2q
— Lokesh Nara (@naralokesh) December 5, 2021