వైసీపీ సర్కార్ , ఏపీ పోలీసుల పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని పేర్కొన్నారు. ఇళ్లకు సీఎం భూమి ఇచ్చారా? రుణం ఇచ్చారా? అని నిలదీశారు. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి? అని ప్రశ్నించారు చంద్రబాబు. ఓటీఎస్ మీద ఆందోళన చేస్తే కేసులు పెడతారా..? కొందరు పోలీసులకు కండకావరం పెరిగిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.
పోలీసులు ఉన్నది చట్టాన్ని అమలు చేయడానికే కానీ.. చట్టాన్ని ఉల్లంఘించేందుకు కాదని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడి ప్రజా పోరాటాలు చేయకుండా ఉండబోమని.. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష..? అని నిలదీశారు. టీడీపీ హయాంలో రూ. 10 వేలు ఇచ్చి ఇళ్ల రిపేర్లకు ఇచ్చామని.. పేదల ఇళ్ల నిర్మాణాలను షీర్ వాల్ టెక్నాలజీతో చేశామని తెలిపారు.
గేటేడ్ కమ్యూనిటీ తరహాలో పేదల ఇళ్ల సముదాయాన్ని నిర్మించామని.. 2.60 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడితే వాటిని పక్కన పెట్టేశారని ఫైర్ అయ్యారు. కరోనా సెంటర్ల కోసం.. వరద బాధితుల కోసం టిడ్కో ఇళ్లను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రాగానే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని…ఓటీఎస్ విషయంలో ప్రజలు సహయ నిరాకరణ చేయాలి.. టీడీపీ అండగా ఉంటుందన్నారు. పేదల ద్రోహి వైసీపీ అని.. పేదలను అవమానిస్తే.. అంబేద్కరును అవమానించినట్టేనని పేర్కొన్నారు.