Unstoppable Episode 4 Promo : అన్‌స్టాపబుల్ షోలో రచ్చ చేసిన‌ అఖండ టీం

-

సినిమాల‌తోనే కాకుండా హోస్ట్ గా త‌న‌లోని మ‌రో టాలెంట్ ను బ‌య‌ట పెడుతూ.. దిగ్విజ‌యంగా ముందుకు సాగుతున్నారు హీరో నంద‌మూరి బాల కృష్ణ‌. తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా ప్ర‌సార‌మ‌వుతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే అనే షో లో బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టాక్ షో కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ షో లో ఇప్ప‌టికే మోహ‌న్ బాబు, మంచు విష్ణు, మంచు ల‌క్ష్మీ, నాచుర‌ల్ స్టార్ నాని, బ్ర‌హ్మానందం, డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి వ‌చ్చి ప్రోగ్రామ్ ను విజ‌య వంతం చేశారు. ఇక తాజాగా అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షో కి… ఈ వారం స్వ‌యంగా అఖండ సినిమా బృందం వ‌చ్చేసింది. ద‌ర్శ‌కుడు బోయ‌బాటి శ్రీ‌ను, హీరోయిన్ ప్ర‌గ్యా జైశ్వాల్‌, శ్రీ‌కాంత్‌, వ‌చ్చారు. అయితే.. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో ను ఆహా టీం విడుద‌ల చేసింది. ఇక ప్రోమోలో బాల‌య్య‌తో అఖండ టీం చాలా సంద‌డి చేసింది. ఈ ప్రోమో ఎంతో వినోదాత్మ‌కంగా ఉండ‌డంతోపాటు బాల‌య్య ఆసక్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. హీరోయిన్ ప్ర‌గ్యాతో బాల‌య్య స్టెప్పులు వేశారు. అంతేకాకుండా.. యూనిట్ స‌భ్యుల‌తో ఫ‌న్నీ గేమ్స్ ఆడి అల‌రించారు బాల‌య్య‌.

Read more RELATED
Recommended to you

Latest news