హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు రోజు రోజు కు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. నిన్న బంజారాహిల్స్ జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో… హైదరాబాద్ నగరం వ్యాప్తంగా… డ్రంక్ అండ్ డ్రైవ్ ను ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు. నిన్న ఒక్క రోజే.. జంట నగరాల్లో 124 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నమోదు అయ్యాయి. అంతేకాదు.. నిన్న రాత్రి 300 మందికి పైగా తాగుబోతులపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు.
ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లో 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటే తప్పించుకునేందుకు కొంత మంది ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులను చూసి పరారయ్యారు కొంత మంది తాగుబోతులు. ఇక ఇది ఇలా ఉండగా… బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం చేసిన రోహిత్, సుమన్‌లను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు….వారిని 14 రోజులు రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అటు. నార్సింగిలో రోడ్డు ప్రమాదం చేసిన సంజీవ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.