ఏపీలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కాస్త పెరిగిన కరోనా కేసులు ఇవాళ తగ్గాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో… కొత్తగా 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా గుంటూరు, కృష్ణాజిల్లాలో ఒక్కొక్కరు మరణించారు.
ఇక గడిచిన 24 గంటల్లో.. 176 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక గడచిన 24 గంటల్లో…31,957 కరోనా పరీక్షలు.. చేసింది ఏపీ ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య…3,06,51,512 కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య… 2074217 కు చేరగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2057749 కు చేరిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 కరోనా యక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 14,4 57 మంది కరోనా కారణంగా మరణించారు.
#COVIDUpdates: 08/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,71,322 పాజిటివ్ కేసు లకు గాను
*20,54,854 మంది డిశ్చార్జ్ కాగా
*14,457 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,011#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rMRQJKXWZk— ArogyaAndhra (@ArogyaAndhra) December 8, 2021