ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భారత్ కు షాక్ ఇచ్చింది. ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ విభాగా లను తొలగిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2028 లో నిర్వహించే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి అమలు అవుతాయని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. అలాగే టోక్యో ఒలింపిక్స్ లో ప్రవేశ పెట్టిన స్పోర్ట్స్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ లను 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ వరకు ఉంటాయని తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఒలింపిక్స్ లలో భారత్ వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ విభాగాలల్లో నే ఎక్కువ పతకాలను సాధిస్తూ వచ్చింది. ఈ రెండు విభాగాల్లో భారత ఆటగాళ్ల భవిష్యత్తు ఉంటుందని అని అనుకుంటున్న సమయం లో ఐఓసీ తీసుకున్న నిర్ణయం తో భారత్ కు పెద్ద దెబ్బ గా మారింది. అయితే టోక్యో ఒలింపిక్స్ తర్వాతే లోనే ఈ రెండు విభాగాల ను తొలగించాలని ఐఓసీ భావించింది. అయితే రెండు ఒకే సారి తొలగించడం వద్ద ని అనుకున్నారు. కానీ తాజా ఈ నిర్ణయం తీసుకుని భారత్ షాక్ ఇచ్చారు.